
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.)
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని
గోపన్పల్లిలో భారీ నగదుతో పారిపోయిన డ్రైవర్ అజిత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ నెల 12న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం లో నగదు నింపేందుకు సిఎంఎస్ (CMS) ఉద్యోగులు ఏటీఎం సెంటర్లోకి వెళ్ళగా అదును చూసి నగదుతో ఉన్న వాహనంతో పరారైన సంగతి విధితమే. ఇద్దరు కస్టోడియన్లు బ్యాంక్ లోపల నగదు నింపే పనిలో ఉండగా సెక్యూరిటీ గార్డు వాష్రూమ్కు వెళ్లారు .అదే సమయంలో డ్రైవర్ అజిత్ (అలియాస్ శివ) రూ. 57 లక్షల నగదుతో సహా వాహనం తీసుకుని పరారయ్యాడు. నిందితుడు వాహనాన్ని తెల్లాపూర్ సమీపంలో వదిలివేసి లోపల ఉన్న సుమారు రూ.57 లక్షల నగదుతో పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు.
నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు గాలిస్తుండగా తెల్లాపూర్ వద్ద వాహన వదిలిపెట్టి నగదుతో పారిపోయినట్లు గుర్తించారు. సిఎంఎస్ ట్రాన్సిట్ వెహికల్ డ్రైవర్ అజిత్ అలియాస్ శివను అరెస్టు చేసేందుకు సాంకేతిక ఆధారాలతో పాటు సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతపురంలో ఉన్నట్టు కనుగొని సిసిఎస్ పోలీసులు అక్కడ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అజిత్ అలియాస్ శివ వద్ద నుంచి రూ.27 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మాదాపూర్ సిసిఎస్ పోలీసులు శివను అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు