
ఆదిలాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.)
జిల్లా జైలులో ఉన్న చెన్నూరు మాజీ
ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పరామర్శించడానికి మాజీ మంత్రి కేటీఆర్ మంగళవారం ఆదిలాబాద్కు వచ్చారు. కేటీఆర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మండలంలోని రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద మాజీ మంత్రి కేటీఆర్ కు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇంటి వద్ద గులాబీ పార్టీ శ్రేణులతో కలిసి మాట్లాడారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. మళ్ళీ వచ్చేది తెలంగాణ ప్రభుత్వమే వస్తుందని ఎవరు కూడా ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు ఇప్పటివరకు సరైన సమయంలో ఎటువంటి సదుపాయాలు అందడం లేదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు ఎంతో నిరాశ చెందుతున్నారని అన్నారు. ఎవరు కూడా నిరాశ చెందవద్దని వచ్చే ది తెలంగాణ ప్రభుత్వమేనని మీకు అండగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఉన్నాడని తెలిపారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని మళ్లీ కరెంటు కోతలు ఉండవని రైతు బంధు మళ్లీ పంపిణీ చేసేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. అనంతరం జిల్లా కేంద్రానికి బయలుదేరి వెళ్లారు, ఈ కార్యక్రమంలో వివిధ మండలాల బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు