సీఎం చేతుల మీదుగా 1000 కుటుంబాలకు ఇండ్ల పంపిణీ: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్నగర్, 24 ఫిబ్రవరి (హి.స.) కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి హౌసింగ్ సొసైటీ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాలలోనే 3 లక్షల 20 వేల ఇండ్లు నిర్మించామని
మంత్రి ఉత్తం


హుజూర్నగర్, 24 ఫిబ్రవరి (హి.స.)

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి

నుంచి హౌసింగ్ సొసైటీ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాలలోనే 3 లక్షల 20 వేల ఇండ్లు నిర్మించామని వీటికి ప్రభుత్వం 5000 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. మంగళవారం హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా హుజూర్నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న సింగిల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన అనంతరం క్యాంప్ కార్యాలయంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ తో జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ జిల్లా ఎస్పీ కె నరసింహతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న 2160 ఇండ్లలో అందులో ఒక 1000 ఇండ్లకు ఈ నెల ఆఖరి వరకు ఆ కాలనీకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డితో ప్రారంభం చేయబోతున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande