ఐటీ షేర్ల పతనంతో ఇవాళ కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు
ముంబయి,24 ,ఫిబ్రవరి (హి.స.) భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ (మంగళవారం) తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా ఐటీ (IT) రంగంలోని షేర్లలో భారీగా అమ్మకాలు కొనసాగడంతో మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ మధ్యాహ్నం 12.15 గంటల సమయానికి సెన్సెక్
Bombay Stock Exchange


ముంబయి,24 ,ఫిబ్రవరి (హి.స.)

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ (మంగళవారం) తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా ఐటీ (IT) రంగంలోని షేర్లలో భారీగా అమ్మకాలు కొనసాగడంతో మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ మధ్యాహ్నం 12.15 గంటల సమయానికి సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 25,500 కీలక స్థాయికి దిగువన కొనసాగుతోంది.

ఐటీ రంగంలో భారీ విక్రయాలు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఐటీ రంగంపై పడే ప్రభావం పట్ల ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆందోళనలు ఈ పతనానికి ప్రధాన కారణం. టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys) వంటి దిగ్గజ కంపెనీల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి.

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) నిరంతరాయంగా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande