
హైదరాబాద్, 25 ఫిబ్రవరి (హి.స.)
ప్రధాని మోడీ ఇజ్రాయెల్ చేరుకున్నారు. తొమ్మిది సంవత్సరాల తర్వాత ప్రధాని మోడీ ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఎయిర్పోర్టులో విమానం ల్యాండ్ అయింది. విమానాశ్రయంలో ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది. ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన కోసం మోడీ ఇజ్రాయెల్ వెళ్లారు. పర్యటనలో భాగంగా పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. అంతేకాకుండా సరికొత్త కూటమి ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మేరకు 2017లో ఇజ్రాయెల్ను సందర్శించిన మొదటి ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించారు. అనంతరం రెండోసారి బుధవారం పర్యటిస్తున్నారు. నెతన్యాహుతో భేటీ తర్వాత రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలపై ఒప్పందాలు జరగనున్నాయి. అలాగే ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్డోగ్ను కూడా కలవనున్నారు.
ఇదిలా ఉంటే మోడీ ఇజ్రాయెల్ పర్యటన నేపథ్యంలో ఆ దేశ ప్రముఖ మీడియా సంస్థ ది జెరూషలేం పోస్ట్కు చెందిన వార్తాపత్రిక మొదటి పేజీలో ప్రధాని మోడీపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. హిందీలో నమస్తే.. హిబ్రూలో షాలోమ్ అంటూ హడ్లైన్ పెట్టింది. ఇందుకు సంబంధించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కథనంలో మోడీ ఫొటో ప్రధానంగా కనిపించింది. మోడీ చేతులు ఊపుతున్నట్లుగా ఉన్న ఫొటో ప్రచురితం చేశారు. భారత్-ఇజ్రాయెల్ సంబంధాల ఆధారంగా కథనాన్ని రాసింది. “స్వాగతం మోడీ అని.. అలాగే మరొకటి 'జెరూషలేంతో భారత్ సంబంధాలు” అనే కథనాలు ప్రింట్ చేసింది. అంతేకాకుండా ఇజ్రాయెల్కు భారత రాయబారి జేపీ.సింగ్కు సంబంధించిన ఇంటర్వ్యూను కూడా వేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు