
ముంబయి,25 ,ఫిబ్రవరి (హి.స.) దేశీయ మార్కెట్లు బుధవారం ఫ్లాట్గా ముగిశాయి (Stock Market Toady). అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూశారు. మరోవైపు విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలకు దిగారు. దీంతో ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి.
క్రితం సెషన్లో భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్ (నిన్నటి ముగింపు 82,225).. నేటి ట్రేడింగ్లో కోలుకుంది. ఉదయం 82,530 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 800 పాయింట్ల మేర ఊగిసలాటకు గురైంది. ఇంట్రాడేలో 82,957 గరిష్ఠానికి.. 82,132 కనిష్ఠానికి చేరింది. చివరకు 50 పాయింట్ల స్వల్పలాభంతో 82,276 వద్ద, నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 25,482 వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.95వద్ద స్థిరపడింది. నిఫ్టీ సూచీలో హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఆదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు రాణించగా.. రిలయన్స్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, ఎటర్నల్, భారతీ ఎయిర్టెల్ స్టాక్స్ నష్టాలను చవిచూశాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ