ఆఫ్ఘన్ తో ఓపెన్ వార్ అంటూ డిక్లేర్ చేసిన పాక్.. ప్రపంచ దేశాలు షాక్..
హైదరాబాద్, 27 ఫిబ్రవరి (హి.స.) పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాలు ఇప్పుడు అత్యంత తీవ్రమైన స్థాయికి చేరుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కాస్తా, క్షేత్రస్థాయిలో ఫిరంగుల మోతగా మారింది.
Pakistan war


హైదరాబాద్, 27 ఫిబ్రవరి (హి.స.)

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ల మధ్య

దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాలు ఇప్పుడు అత్యంత తీవ్రమైన స్థాయికి చేరుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కాస్తా, క్షేత్రస్థాయిలో ఫిరంగుల మోతగా మారింది. పాకిస్థాన్ ఏకంగా ఆఫ్ఘన్ మీద ఓపెన్ వార్ ప్రకటించడం ప్రపంచదేశాలను షాక్ కు గురి చేసింది. అయితే పాక్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్థాన్పై 'ఓపెన్ వార్' ప్రకటించడం వెనుక దశాబ్దాల రాజకీయ, భద్రతా వైఫల్యాలు ఉన్నాయని తెలుస్తోంది. పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తున్వా (KPK), బలూచిస్థాన్ ప్రాంతాల్లో 'తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్' (TTP) ఉగ్రవాదులు చేస్తున్న దాడులు పాక్ సైన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వం ఆశ్రయం ఇస్తోందని, అండతోనే పాక్ భూభాగంలోకి చొరబడి దాడులకు వారి పాల్పడుతున్నారని పాక్ గట్టిగా ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే పాక్ వైమానిక దళం (PAF) ఇటీవల సరిహద్దు దాటి ఆఫ్ఘనిస్థాన్లోని ఖోస్ట్, కునార్ ప్రావిన్సులపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో తమ పౌరులు మరణించారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆఫ్ఘన్ తాలిబన్లు, వెంటనే తమ భారీ ఫిరంగులను సరిహద్దులకు తరలించి పాక్ పోస్టులపై ఎదురుదాడికి దిగారు.

డురాండ్ లైన్ వివాదం

ఈ యుద్ధానికి ప్రధాన కారణం కేవలం ఉగ్రవాదం మాత్రమే కాదు. బ్రిటిష్ కాలం నాటి 'డురాండ్ లైన్' (Durand Line) సరిహద్దు కూడా. ఈ సరిహద్దును ఆఫ్ఘనిస్థాన్ ఎన్నడూ గుర్తించలేదు. పష్టూన్ తెగకు చెందిన ప్రజలు ఇరువైపులా ఉన్నందున, అక్కడ కంచె వేయడాన్ని తాలిబన్లు అడ్డుకుంటున్నారు. గతంలో తాలిబన్లను అధికారంలోకి తీసుకురావడానికి సహాయం చేసిన పాకిస్థాన్కే, ఇప్పుడు వారే బద్ద శత్రువులుగా మారడం తలనొప్పిగా మారింది. మరోవైపు, పాక్లో చైనా నిర్మిస్తున్న CPEC ప్రాజెక్టులపై కూడా ఆఫ్ఘన్ దాడులు జరుపుతుండటంతో, చైనా నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలోనే పాక్ ఆర్మీ చీఫ్, ప్రభుత్వం కలిసి ఆఫ్ఘనిస్థాన్పై వ్యవహరించాలని, అవసరమైతే పూర్తిస్థాయి యుద్ధానికి వెనకాడబోమని హెచ్చరికలు జారీ చేశారు. కఠినంగా

దక్షిణాసియా దేశాల్లో అస్థిరత

ఈ 'ఓపెన్ వార్' వల్ల దక్షిణ ఆసియా మొత్తం అస్థిరతకు లోనయ్యే అవకాశం ఉంది. అటు ఇరాన్తో కూడా పాకిస్థాన్కు సరిహద్దు గొడవలు ఉండటంతో, పాక్ ఇప్పుడు రెండు వైపులా యుద్ధాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ యుద్ధం ముదిరితే, ఆఫ్ఘనిస్థాన్ నుండి పెద్ద ఎత్తున శరణార్థులు పొరుగు దేశాలకు వలస వచ్చే ప్రమాదం ఉంది. భారతదేశం ఈ పరిణామాలను అత్యంత జాగ్రత్తగా గమనిస్తోంది. పాకిస్థాన్ తన గడ్డపై ఉగ్రవాదాన్ని పెంచి పోషించి, ఇప్పుడు అదే ఉగ్రవాదం వల్ల నానా ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది తాము తీసుకున్న గోతిలో తామే పడటం అనే సామెతను గుర్తు చేస్తోందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆర్థికంగాదివాళా తీసే స్థితిలో ఉన్న పాకిస్థాన్, ఇలాంటి యుద్ధాన్ని భరించగలదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande