
అమరావతి, 28 ఫిబ్రవరి (హి.స.), రైతు సంక్షేమం, రాష్ట్ర ఆర్థిక పురోగతికి కీలకమైన వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రా ధాన్యం ఇస్తోందని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రైతుల ఆదాయం పెంపు, సమర్థంగా వనరుల వినియోగమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో వ్యవసాయానికి స్వర్ణయుగం వచ్చిందని, వ్యవసాయాన్ని యాంత్రీకరణ స్థాయి దాటి డ్రోన్ వినియోగం వరకూ తీసుకెళుతున్నామని చెప్పారు. వ్యవసాయ రంగంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యాలకు అనుగుణం గా వ్యవసాయ రంగంలో కనీసం 15శాతం వార్షిక వృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రణాళికా బద్ధంగా పనిచేస్తున్నాం. 2024-25లో 11.64 శాతం వృద్ధి నుంచి ప్రస్తుత ఆర్థిక సం వత్సరంలో 16శాతం సాధించాం. ఉచిత వ్యవసాయ విద్యుత్ 22.5లక్షల పంపుసెట్లకు రోజూ 9గంటలు ఇస్తూ రూ.13,241కోట్ల సబ్సిడీ భరిస్తున్నాం.
గత ప్రభుత్వంలో ధరల స్థిరీకరణకు రూ.7700కోట్లు కేటాయించినట్లు చెబుతున్నవన్నీ అబద్ధాలే. ఐదేళ్లలో కేవలం రూ.1475కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. నాలుగు లక్షల పశువులు కొనుగోలు చేసినట్లు పేపర్లలో చూపించి ఒక్కటంటే ఒక్కటి కూడా కొనుగోలు చేయలేదు. రాష్ట్రంలోని రైతులకు కేంద్ర పథకాలను సైతం(మ్యాచింగ్ గ్రాంట్ 40శాతం కట్టలేక) సద్వినియోగం చేసుకోని దుర్మార్గులు వైసీపీ పాలకులు’ అంటూ మండిపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ