తిరుమల భక్తులకు అప్డేట్: శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..!
తిరుమల , 28 ఫిబ్రవరి (హి.స.)తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో
తిరుమల


తిరుమల , 28 ఫిబ్రవరి (హి.స.)తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో, భక్తుల క్యూలైన్లు వెలుపల ఉన్న కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు బారులు తీరాయి.

టీటీడీ విడుదల చేసిన వివరాల ప్రకారం, శుక్రవారం (ఫిబ్రవరి 27) ఒక్కరోజే 67,952 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 27,414 మంది తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.97 కోట్లుగా నమోదైనట్లు టీటీడీ వెల్లడించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande