బుల్లితెర ప్రేక్షకులకు పండగ.. ఈ వారం థియేటర్, OTTల్లోకి రాబోయే సినిమాలు
హైదరాబాద్, 03 ఫిబ్రవరి (హి.స.) ఈ వారం థియేటర్ తో పాటు ఓటీటీలోకి చాలా సినిమాలే రాబోతున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 6వ తేదీన అంటే శుక్రవారం రోజున నుంచి ఈ సినిమా అందుబా
0tt


హైదరాబాద్, 03 ఫిబ్రవరి (హి.స.)

ఈ వారం థియేటర్ తో పాటు ఓటీటీలోకి చాలా సినిమాలే రాబోతున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 6వ తేదీన అంటే శుక్రవారం రోజున నుంచి ఈ సినిమా అందుబాటులోకి వస్తుంది.

అటు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన నారీ నారీ నడుమ మురారి సినిమా కూడా నెల రోజులు తిరగకు ముందే అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత పరాశక్తి సినిమా కూడా ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జి 5 లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. అటు సైక్ సిద్ధార్థ ఫిబ్రవరి 4వ తేదీ అంటే ఎల్లుండి నుంచి ఆహాలో రానుంది. సన్ నెక్స్ట్ లో నీలకంఠ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీ ఫిబ్రవరి 6వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande