
హైదరాబాద్, 04 జూన్ (హి.స.)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని చూపిస్తోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అడ్వాన్స్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. విడుదలకు ముందే సినిమాపై నెలకొన్న హైప్కు నిదర్శనంగా బుక్మైషోలో నమోదైన టికెట్ అమ్మకాలు నిలిచాయి. ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ బుక్మైషోలో కేవలం ఒక్క గంట వ్యవధిలోనే 45 వేలకుపైగా టికెట్లు అమ్ముడవడం ద్వారా 'పెద్ది' అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దీంతో బుక్మైషో అవర్లీ ట్రెండింగ్ చరిత్రలో 40 వేల టికెట్ల మార్క్ న్ను దాటిన నాలుగో తెలుగు చిత్రంగా ఈ సినిమా నిలిచింది.
ఇప్పటికే ఈ జాబితాలో ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD', 'సలార్', అలాగే అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' చిత్రాలు ఉండగా, ఇప్పుడు ఆ ప్రతిష్టాత్మక జాబితాలో 'పెద్ది' కూడా చేరింది. 2023లో బుక్మేషో ప్రవేశపెట్టిన అవర్లీ ట్రెండింగ్ ఫీచర్ తర్వాత తెలుగు సినిమాలపై ప్రేక్షకుల ఆసక్తిని కొలిచే ప్రధాన ప్రమాణంగా ఈ రికార్డులు మారాయి. అలాంటి పరిస్థితుల్లో 45 వేల టికెట్ల అమ్మకాలతో 'పెద్ది' సత్తా చాటడం విశేషంగా మారింది. ముఖ్యంగా విడుదలకు ముందే ఇంతటి స్పందన రావడం, రామ్ చరణ్ మార్కెట్ రేంజ్ను మరోసారి నిరూపించిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. గ్రామీణ నేపథ్యంతో పాటు క్రీడా అంశాలను మేళవిస్తూ రూపొందించిన ఈ కథలో చరణ్ కొత్త లుక్, ప్రత్యేకమైన పాత్రలో నటించడం విశేషం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..