
హైదరాబాద్, 04 ఫిబ్రవరి (హి.స.)పాలమూరు బిజెపి విజయ సంకల్ప సమ్మేళనంలో బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారి ప్రసంగం- ముఖ్యాంశాలు:
*****************
ఈ రోజు తెలంగాణ గడ్డపై, మీ అందరి మధ్యకు రావడం నాకు గొప్ప గౌరవంగా, అపూర్వమైన అదృష్టంగా భావిస్తున్నాను. ఎయిర్‌పోర్ట్‌లో పార్టీ కార్యకర్తలు చూపించిన ఆత్మీయ అభివాదానికి, ప్రత్యేకంగా గిరిజన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
తెలంగాణ గడ్డపై అడుగుపెట్టిన ఈ రోజు, ముందుగా ఈ పవిత్ర భూమికి నమస్కరిస్తూ జోగులాంబ అమ్మవారికి, మైసిగండి మైసమ్మ అమ్మవారికి, ఉమా మహేశ్వర ఆలయ అమ్మ-స్వామివార్లకు శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నాను.
తెలంగాణ విమోచన సంగ్రామంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసి ప్రాణాలర్పించిన ప్రతి అమరవీరుడికి ఈ సందర్భంగా నా వినమ్ర నివాళులు అర్పిస్తున్నాను.
హైదరాబాద్ విముక్తి కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేశారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారిని స్మరిస్తూ, ఆయన నాయకత్వంలోనే తెలంగాణ ప్రజలు నిజాం పాలన నుంచి విముక్తి పొందిన విషయాన్ని గర్వంతో గుర్తుచేసుకుంటున్నాను.
ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి రావడం, ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల సందర్భంలో మొదటిసారి ఈ ప్రాంతానికి రావడం నాకు ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నాను.
మహబూబ్‌నగర్ పట్టణ ప్రజలే కాకుండా, ఆదివాసీ సోదరులు తమ సంప్రదాయ నృత్యాలతో నన్ను ఆత్మీయంగా ఆదరించినందుకు వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
ఈ సందర్భంగా తెలంగాణ నుంచి పద్మ పురస్కారాలు పొందిన మహానుభావులను గుర్తుచేసుకుంటూ.. వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రతిభను గుర్తించి ఈ గౌరవం అందించిన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఈ రోజు తెలంగాణ రాజకీయాలు ఒక అత్యంత గంభీర మలుపు తీసుకున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, సంపూర్ణంగా సంతుష్టీకరణ రాజకీయాల పరాకాష్టకు చేరుకుంది.
తెలుగు ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను నిరంతరం అవమానిస్తూ, సనాతన ధర్మంపై దాడులు చేస్తూ, ‘కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్’ అనే ప్రమాదకరమైన నినాదాలను వినిపించడం ద్వారా, తమ అసలు రాజకీయ స్వభావాన్ని బయటపెడుతూ, దిగజారుడు రాజకీయాలతో ఓ వర్గాన్ని సంతృప్తిపరచడానికి మాత్రమే వారు ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వక్ఫ్ బోర్డులను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. దేశంలోనే అత్యంత సంపన్నమైన వక్ఫ్ బోర్డును ఏర్పాటుచేయాలనే ప్రయత్నం కేవలం ఓట్ల రాజకీయాల కోసం జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల నిధుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీగా కోత విధిస్తోంది.
ఈ అన్యాయానికి తెలంగాణ ప్రజలు తగిన సమాధానం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది.
పలుచోట్ల హిందూ దేవాలయాలపై బహిరంగంగా దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకపోవడం బాధాకరం. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఆలయ భూములను ఆక్రమిస్తున్నారు. రాష్ట్రంలో సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడులను ఏమాత్రం సహించబోం.
సనాతన భారత సంప్రదాయంపై దాడులు జరిగితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మౌనంగా ఉండరు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం బిజెపి కార్యకర్తలు ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారు.
ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ భవిష్యత్తు కోసం, సంస్కృతి–సంప్రదాయాల రక్షణ కోసం,
న్యాయం–సమానత్వం కోసం భారతీయ జనతా పార్టీకి బలమైన మద్దతు ఇవ్వాలి.
తెలంగాణలో చంగిచర్లలో, ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన విద్వంసం మళ్లీ జరగకుండా అడ్డుకోవాలి.
“రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాలపై దాడులను నివారించడంలో విఫలమవుతోంది, హిందూ దేవాలయ భూములను ఆక్రమిస్తోంది, పండుగల పైన ఆంక్షలు విధిస్తోంది.
సనాతన ధర్మం భారతదేశానికి ఆత్మ. కాబట్టి భారతదేశ ఆత్మ మీద ఎవరైనా దాడి చేస్తే, బిజెపి కార్యకర్తలు సరైన రీతిలో బదులు ఇస్తారని హెచ్చరిస్తున్నాం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా మహిళల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. కాని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అన్యాయం చేస్తోంది.
“ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సాయం, కళ్యాణ లక్ష్మి స్కీమ్‌లో తులం బంగారం మరియు లక్ష రూపాయల వాగ్దానాలు ఇచ్చినట్టు హామీ ఇచ్చింది, అయితే వాటిని అమలు చేయలేదు. బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు ఈ అన్యాయాలను గుర్తు చేస్తూ, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన జవాబు చెప్పే విధంగా ప్రచారం చేయాలి.
రైతు భరోసా కింద రైతులకు ఎకరానికి రూ. 15 వేలు, రైతు కూలీలకు రూ. 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయలేదు. ఎస్సీ–ఎస్టీ, ఓబీసీ, ఆదివాసి వర్గాలకు మోసం చేసింది. ఈ మోసానికి తగిన బుద్ధి చెప్పడం అవసరం.
తెలంగాణ ప్రజలకు బిజెపి ద్వారానే న్యాయం జరుగుతంది. ఈ విషయాన్ని బిజెపి కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. తెలంగాణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాలి.
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కమిషన్లీ పాలన, ల్యాండ్ మాఫియా కొనసాగింది. ప్రతి చోటా టాక్స్ లతో భారం మోపారు.
రాష్ట్రంలో కమీషన్ల పేరుతో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అభివృద్ధి పనులు, బిల్లుల మంజూరుకు చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ఆర్ఆర్ ట్యాక్స్ కట్టాల్సిన దుస్థితి దాపురించింది. ఈ అవినీతి, కమీషన్ల ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించాలి. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించాలి.
నరేంద్ర మోదీ ప్రభుత్వం హైదరాబాద్–పూణే, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై వంటి హై-స్పీడ్ రైల్ కారిడార్లు నిర్మాణం చేపడుతోంది. ఫార్మా, పారిశ్రామిక రంగాల్లో, మేగా టెక్స్టైల్ మరియు ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణంతో తెలంగాణ అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. ఇది తెలంగాణ ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి నేరుగా దోహదపడుతుంది.
గత అసెంబ్లీ, లోక సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 35 శాతానికి పైగా ఓటు శాతం సాధించింది. ఈసారి ప్రతి బూత్‌లో 50% ఓట్లు సాధించడం లక్ష్యంగా కార్యకర్తలు కృషిచేయాలి.
లోక్ సభ ఎన్నికల తర్వాత దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రజలు నరేంద్ర మోదీ పాలన పట్ల మరింత విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో.. మహారాష్ట్ర, కేరళ, తిరువనంతపురం, గోవా, అరుణాచల్, చండీగఢ్, బీహార్.. ఇలా ప్రతిచోట బిజెపి అభ్యర్థులు విజయం సాధించడమే ఇందుకు నిదర్శనం.
తెలంగాణలో బిజెపి కార్యకర్తలు, ప్రజల మధ్యకు వెళ్లి నరేంద్ర మోదీ గారి నాయకత్వం పట్ల ప్రజల ఆత్మవిశ్వాసాన్ని మరింత సుస్థిరం చేయాలి.
స్థానిక ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఇంటికి వెళ్లి బిజెపిని గెలిపించేలా ప్రజల మద్దతు కూడగట్టాలి. యువనాయకులను ప్రోత్సహించాలి.
తెలంగాణను రక్షించడానికి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బిజెపి కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి కృషి చేయాలి. ఇది ప్రతి కార్యకర్త బాధ్యత. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు బిజెపిని గెలిపించేలా కృషిచేయాలి. ఇదే తెలంగాణలో బిజెపి విజయానికి సంకల్పం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు