భారత టెక్ చరిత్రలో మరో మైలురాయి.. దేశీయంగానే 2-నానో మీటర్ చిప్ డిజైన్
బెంగళూరు, 07 ఫిబ్రవరి (హి.స.) దేశీయంగానే 2 - నానో మీటర్ చిప్ సెమీ కండక్టర్ (2-nanometer chip design) (Semiconductor) తయారు చేయడంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Union Minister Ashwini Vaishnav) హర్షం వ్యక్తం చేశారు. డిజైన్ రంగంలో భారత్ ప్రపంచ ద
Semiconductor


బెంగళూరు, 07 ఫిబ్రవరి (హి.స.)

దేశీయంగానే 2 - నానో మీటర్ చిప్

సెమీ కండక్టర్ (2-nanometer chip design) (Semiconductor) తయారు చేయడంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Union Minister Ashwini Vaishnav) హర్షం వ్యక్తం చేశారు. డిజైన్ రంగంలో భారత్ ప్రపంచ దేశాలకు దీటుగా ఎదుగుతోందని స్పష్టం చేశారు. శనివారం బెంగళూరులోని క్వాల్కామ్ (Qualcomm) కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, భారత్లో రూపొందించిన అత్యాధునిక 'టూ-నానోమీటర్ (2nm) చిప్', వేఫర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిప్ డిజైనింగ్లో భారత్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.

బ్యాక్ ఆఫీస్ నుండి ఎండ్-టు-ఎండ్ హబ్:

గతంలో భారతదేశం కేవలం బ్యాక్ ఆఫీస్ పనులకు, పాక్షిక సాఫ్ట్వేర్ అభివృద్ధికి పరిమితమయ్యేదని, కానీ ఇప్పుడు మాత్రమే రోజులు మారిపోయాయని మంత్రి పేర్కొన్నారు. కస్టమర్ అవసరాలకు తగ్గట్టుగా ప్రొడక్ట్ నిర్వచించడం (Product Definition) నుంచి తుది సిలికాన్ డిజైన్, టేప్- అవుట్, వాలిడేషన్ వరకు.. అంటే ఒక చిప్ తయారీలో ఉండే ప్రతి దశ ఇప్పుడు భారత్లోనే జరుగుతోంది అని ఆయన వివరించారు. ఇప్పటికే AMD వంటి దిగ్గజ సంస్థలు ఈ బాటలో పయనిస్తుండగా, ఇప్పుడు క్వాల్కామ్ కూడా దేశీయంగానే పూర్తి స్థాయి ఉత్పత్తులను డిజైన్ చేయడం గర్వకారణమని మంత్రి కొనియాడారు.

సెమీకండక్టర్ రంగానికి అవసరమైన పూర్తిస్థాయి పర్యావరణ వ్యవస్థను (Ecosystem) ప్రభుత్వం దేశంలోనే నిర్మిస్తోందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇంతటి క్లిష్టమైన సవాలును స్వీకరించి, విజయవంతంగా 2nm చిప్ను భారత్లో రూపొందించిన క్వాల్కామ్ ఇంజనీర్లను, బృందాన్ని ఆయన అభినందించారు. ఈ పరిణామం భారతీయ ఎలక్ట్రానిక్ పరిశ్రమకు ఒక భారీ మేజర్ డెవలప్మెంట్ అని, ఇది భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులకు, ఉపాధి అవకాశాలకు దారితీస్తుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande