ఆ 11 గగనతలాలకు దూరంగా ఉండండి’.. ఎయిర్లైన్స్కు డీజీసీఏ సూచన
ఢిల్లీ, 01 మార్చి (హి.స.)పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విమానయాన సంస్థలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. మార్చి 2 వరకు ఆ ప్రాంతంలోని 11 దేశాల గగనతలాలను ఉపయోగించొద్దని డీజీసీఏ (DGCA) తెలిపింది. ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, యూఏఈ, సౌదీ అరేబియ
ఆ 11 గగనతలాలకు దూరంగా ఉండండి’.. ఎయిర్లైన్స్కు డీజీసీఏ సూచన


ఢిల్లీ, 01 మార్చి (హి.స.)పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విమానయాన సంస్థలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. మార్చి 2 వరకు ఆ ప్రాంతంలోని 11 దేశాల గగనతలాలను ఉపయోగించొద్దని డీజీసీఏ (DGCA) తెలిపింది. ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఖతర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఎయిరిండియా, ఇండిగో, ఆకాశ ఎయిర్, స్పైజ్జెట్ తదితర భారత విమానయాన సంస్థలు ఇప్పటికే పశ్చిమాసియా దేశాలకు తమ విమాన సర్వీసులను నిలిపివేశాయి.

పశ్చిమాసియాకు విమానాల రద్దు కారణంగా వేలాది మంది ప్రయాణికులపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు విమానయాన సంస్థల ప్రతినిధులు, ఎయిర్పోర్టుల నిర్వాహకులు తదితరులతో సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల భద్రత, కార్యకలాపాల కొనసాగింపు తదితర అంశాలపై చర్చించారు. నిబంధనలు పాటిస్తూ.. అవసరమైన చోట విమానాలను దారి మళ్లించడం వంటివి చేయాలని కేంద్రమంత్రి ఆదేశించినట్లు పౌర విమానయాన శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande