LPG విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం.. చమురు శుద్ధి సంస్థలపై ఎస్మా యాక్ట్
ఢిల్లీ, 10 మార్చి (హి.స.) ఇరాన్ వార్ ఎఫెక్ట్ ఇండియాలోని ఎల్పీజీ వినియోగదారుల్లో (LPG supply India) ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. దేశీయంగా ఉన్న గ్యాస్ నిల్వలు పక్కదారి పట్టకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించగా తాజాగా మరో సంచల
esmas-focus-on-oil-refineries-530874


ఢిల్లీ, 10 మార్చి (హి.స.)

ఇరాన్ వార్ ఎఫెక్ట్ ఇండియాలోని ఎల్పీజీ వినియోగదారుల్లో (LPG supply India) ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. దేశీయంగా ఉన్న గ్యాస్ నిల్వలు పక్కదారి పట్టకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించగా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చమురుశుద్ధి సంస్థలపై ఎస్మా (ESMA - Essential Services Maintenance Act) చట్టాన్ని ప్రయోగించింది. ఎల్పీజీ ఉత్పత్తి పెంచేలా ఆయిల్ రిఫైనరీలను ఆదేశించింది. గ్యాస్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. డొమెస్టిక్ గ్యాస్, ఎరువుల ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లకే తొలి ప్రాధ్యాన్యం ఇస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ నిల్వలు తగ్గకుండా పెట్రోలియం శాఖ చర్యలు చేపట్టింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande