
బెంగళూరు, 10 మార్చి (హి.స.)
టమాటోలు కేవలం వంటకు రుచిని మాత్రమే కాదు, అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. రోజువారీ ఆహారంలో టమాటాలను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. టమాటోలో ఉండే పోషకాలు శరీరానికి చాలా ముఖ్యమైనవి. టమాటోలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా టమాటో తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. టమాటోలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు తోడ్పడుతుంది.
మీరు రోజూ టమాటా తింటారా. మామూలుగా అయితే ఎలా తింటారు. కూర చేసుకుంటారు. లేదా పచ్చడి తింటారు. వేరే కూరలలో కలిపి వండి తింటారు. కానీ..సరైన విధంగా మీకు ప్రయోజనాలు అందాలంటే మాత్రం ఇప్పుడు చెప్పినట్టుగానే తినాలి. ఎలా అంటే..పచ్చి టమాటా తీసుకోవాలి. మీరు విన్నది నిజమే. టమాటాను పచ్చి, కూర రూపంలో కన్నా పచ్చిగా తింటేనే ఎక్కువ ఆరోగ్య లాభాలు అందుతాయని బెంగళూరుకు చెందిన ఆరోగ్య నిపుణులు ఎన్ .శివప్ప చెబుతున్నారు.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా టమాటోలు సహాయపడతాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు లేదా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి ప్రయోజనకరం. టమాటోలోని యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడతాయి. పొటాషియంతో నిండిన టమాటోలు రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. విటమిన్ ఏ, సి, కొల్లాజెన్ సమృద్ధిగా ఉండటం వల్ల టమాటాలు చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇవి వృద్ధాప్య సంకేతాలను తగ్గించి, చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచడంలో తోడ్పడతాయి. టమాటోలను జ్యూస్ రూపంలో లేదా నేరుగా తినడం ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు.
టమాటాలో ఎన్నో పోషకాలుంటాయి. ఇందులో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు బయటకు వెళ్లిపోతాయి. ఇక ఇందులో లికోపిన్ కూడా ఉంటుంది. అయితే పచ్చి టమాటా తింటే ఈ పోషకాలన్నీ సరైన విధంగా శరీరానికి అందే అవకాశం ఉంటుంది. రోజూ పచ్చి టమాటా తింటే బీపీ తగ్గడంతో పాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV