గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఆపేయాలి: ఐరాసలో తీర్మానం
దిల్లీ:, 12 మార్చి (హి.స.)పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. ఇరాన్ (Iran)పై అమెరికా- ఇజ్రాయెల్ భీకర స్థాయిలో దాడులు చేస్తున్నాయి. ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల (Gulf countries)పై విరుచుకుపడుతోంది. ఇప్పటికైనా టెహ్రాన్ ఈ దాడులను ఆపేయాలని ఐక
గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఆపేయాలి: ఐరాసలో తీర్మానం


దిల్లీ:, 12 మార్చి (హి.స.)పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. ఇరాన్ (Iran)పై అమెరికా- ఇజ్రాయెల్ భీకర స్థాయిలో దాడులు చేస్తున్నాయి. ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల (Gulf countries)పై విరుచుకుపడుతోంది. ఇప్పటికైనా టెహ్రాన్ ఈ దాడులను ఆపేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UN Security Council)లో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భారత్ కో స్పాన్సర్గా తీసుకొచ్చిన ఈ తీర్మానానికి ఆమోదం లభించింది.

బహ్రెయిన్ తీసుకొచ్చిన ఈ తీర్మానంలో 130 దేశాలు కో స్పాన్సర్లుగా ఉన్నాయి. అందులో భారత్ కూడా ఒకటి. ఇరాన్ దాడులు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ యుద్ధం ప్రపంచ శాంతిభద్రతలకు తీవ్ర ముప్పును కలిగిస్తోందని ఆరోపించారు. ‘బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్లపై ఇరాన్ చేస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలి’ అంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా ఎవరూ ఓటు వేయలేదు. భద్రతామండలిలో మొత్తం 15 సభ్యదేశాలు ఉండగా.. 13 ఓట్లతో దీనికి ఆమోదం లభించింది. ఈ ఓటింగ్ ప్రక్రియకు ఇరాన్ మిత్రదేశాలైన చైనా (China), రష్యా (Russia)లు దూరంగా ఉన్నాయి. హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ చర్యలను కూడా ఐరాస భద్రతా మండలి ఖండించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande