
ముంబయి, 12, మార్చి (హి.స.)ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎడాపెడా విధించిన సుంకాలు చెల్లవంటూ అగ్రరాజ్య సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇతరదేశాలపై ఎలాగైనా టారిఫ్ (Trump Traiffs)లు వసూలుచేయాలని కంకణం కట్టుకున్న ట్రంప్.. ఇందుకోసం కొత్తదారులు వెతుకుతున్నారు. తాజాగా ‘సెక్షన్ 301’ ఆయుధాన్ని బయటకు తీశారు. దీనికింద భారత్, చైనా సహా 16 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు అమెరికా (USA) వాణిజ్య శాఖ ప్రతినిధి జెమిసన్ గ్రీర్ కీలక ప్రకటన చేశారు.
1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద.. భారత్, చైనా, యూరోపియన్ యూనియన్, సింగపూర్, స్విట్జర్లాండ్, నార్వే, ఇండోనేసియా, మలేసియా, కాంబోడియా, థాయ్లాండ్, దక్షిణ కొరియా, వియత్నాం, తైవాన్, బంగ్లాదేశ్, మెక్సికో, జపాన్ దేశాలపై ఈ దర్యాప్తు జరగనుందని గ్రీర్ వెల్లడించారు. కాగా.. ఈ జాబితాలో కెనడా లేకపోవడం గమనార్హం.
ఏంటీ సెక్షన్ 310 దర్యాప్తు..?
ఇతర దేశాలు అనుసరిస్తున్న అన్యాయమైన వాణిజ్య విధానాలను సవాలు చేసేందుకు అమెరికాకు ఉన్న శక్తిమంతమైన ఆయుధమే ఈ సెక్షన్ 301. తమ వాణిజ్య భాగస్వాములు అనుసరిస్తున్న ట్రేడ్ పాలసీలు (Trade Policies).. అమెరికా వ్యాపారాలు, ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నాయా? అనేదానిపై ఈ చట్టం కింద అమెరికా దర్యాప్తు చేసేందుకు వీలు లభిస్తుంది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ