తిరుపతి లోని వకుళ మాత ఆలయంలో అక్షరాభయ్ష పూజ విధానానికి శ్రీకారం
, తిరుపతి13 మార్చి (హి.స.): బుడిబుడి అడుగులతో బడిగడప తొక్కే వయసులో.. ఆ చిన్నారి చేతులకు పలకా బలపం ఇచ్చి దైవసన్నిధిలో తొలి అక్షరానికి శ్రీకారం చుట్టించడం హిందూ కుటుంబాల్లో ఆనవాయితీ. ఆ అక్షరాభ్యాస వేడుక ఏడుకొండలవాడి ఆశీస్సులతో, స్వామివారి మాతృమూర్తి
తిరుపతి లోని వకుళ మాత ఆలయంలో  అక్షరాభయ్ష పూజ విధానానికి శ్రీకారం


, తిరుపతి13 మార్చి (హి.స.): బుడిబుడి అడుగులతో బడిగడప తొక్కే వయసులో.. ఆ చిన్నారి చేతులకు పలకా బలపం ఇచ్చి దైవసన్నిధిలో తొలి అక్షరానికి శ్రీకారం చుట్టించడం హిందూ కుటుంబాల్లో ఆనవాయితీ. ఆ అక్షరాభ్యాస వేడుక ఏడుకొండలవాడి ఆశీస్సులతో, స్వామివారి మాతృమూర్తి అయిన శ్రీవకుళమాత సన్నిధిలో జరిగితే ఆ ఆనందమే వేరు! తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడీ సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణలోని ప్రసిద్ధ బాసర జ్ఞానసరస్వతీదేవి ఆలయం తరహాలో తిరుపతిలోని వకుళమాత ఆలయంలోనూ అక్షరాభ్యాసం పూజా విధానాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande