
యాదాద్రి భువనగిరి, 13 మార్చి (హి.స.) యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను శుక్రవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంత్ తనిఖీ చేశారు. డాక్టర్, వైద్య సిబ్బంది రోజు వస్తున్నారా? లేదా? అని రిజిస్టర్ చెక్ చేశారు.ఆసుపత్రికి వచ్చిన పెషేంట్స్తో మాట్లాడారు. ఎందుకు వచ్చారు? అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ ఎలా చూస్తున్నారు అని అడిగారు.పి. ఎచ్ సి లో రోజు ఒపీ ఎంత మంది వస్తున్నారు. వచ్చిన వాళ్ళ వివరాలు ఆన్లైన్ లో రిజిస్టర్ చేయాలి. వాళ్ళ చెకప్ తరవాత ఏమి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఏం మెడిసిన్స్ ఇచ్చారో అది కూడా రిజిస్టర్ చేయాలి అన్నారు. ఆసుపత్రిలో ల్యాబ్, మెడికల్, లేబర్ రూమ్ చెక్ చేశారు. గత నెలలో ఎన్ని డెలివరీలు జరిగాయి? అని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్, వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్ చెక్ చేశారు. నిత్యం రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో నాగవేణి, తాహసీల్దార్ ప్రదీప్ కుమార్ ఆర్ ఐ నరసింహులు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..