
అమరావతి, 13 మార్చి (హి.స.)పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ కొరత ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలోని పలు ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే తాత్కాలికంగా మూసేశారు. కొన్ని చోట్ల కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. స్టార్టర్స్ వంటివి కట్టెలపై చేయలేమని, దీంతో ఆర్థికంగా నష్టపోతున్నామని హోటల్ యజమానులు చెబుతున్నారు. రోజులు గడిచే కొద్దీ రెండో సిలిండర్ ఇస్తారో, ఇవ్వరో అని నగరంలోని పలు గ్యాస్ ఏజెన్సీల వద్ద బుకింగ్ చేసుకునేందుకు వినియోగదారులు బారులుదీరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ