
అమరావతి, 13 మార్చి (హి.స.)
ఏర్పేడు, ఏకశిల్పంపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువుదీరి దేశంలోనే మొట్టమొదటి పురాతన ఆలయమైన గుడిమల్లం శ్రీ పరశురామేశ్వరస్వామి ఆలయం దశాబ్దాల తర్వాత మహాకుంభాభిషేకానికి సిద్ధమైంది. క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో ఆలయ నిర్మించినట్లు చరిత్రకారులు భావిస్తుండగా పల్లవ, చోళ, విజయనగర రాజులు ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. అయితే అప్పట్లో ఆలయానికి మహాకుంభాభిషేకం నిర్వహించగా తర్వాత కాలంలో ఎలాంటి క్రతువులు జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయంపై ప్రత్యేక దృష్టిసారించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ