
నంద్యాల,13 మార్చి (హి.స.), :నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. మహానంది క్షేత్రం వెనుక ఉన్న అటవీ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటన స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ మంటల వల్ల అడవిలో నివసించే వన్యప్రాణుల మనుగడకు ముప్పు ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు.నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానంది ఆలయం వెనుక భాగంలో విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఎండాకాలం కావడంతో ఎండిపోయిన చెట్లు, ఆకులు ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. స్థానికులు ఈ మంటలను గమనించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే ఇప్పటికీ పూర్తిస్థాయిలో మంటలు అదుపులోకి రాలేదని సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ