
డిల్లీ, 13 మార్చి (హి.స.)పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తతలు, ప్రాణ నష్టంపై మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలాగే భారతీయుల భద్రత, ఇంధన సరఫరాపై కీలకంగా మోడీ చర్చించారు.
ఫోన్ సంభాషణ తర్వాత మోడీ కీలక ట్వీట్ చేశారు. ‘‘పశ్చిమాసియాలోని తీవ్రమైన పరిస్థితి గురించి చర్చించడానికి ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియన్‌తో మాట్లాడాను. ఉద్రిక్తతలు పెరగడం, పౌర ప్రాణనష్టం, అలాగే పౌర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాను.’’ అని రాసుకొచ్చారు.
ప్రపంచ సంక్షోభం నుంచి ఉత్పన్నమయ్యే ఆర్థిక ఒత్తిళ్లను ప్రభుత్వం ఎలా నిర్వహించిందో రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ సమయంలో భారతదేశం విధానాన్ని ప్రధానమంత్రి మోడీ గుర్తుచేవారు. ‘‘యుద్ధ పరిణామాల భారం భారత పౌరులపై పడకుండా చూసుకోవడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అన్ని ప్రయత్నాలు చేసింది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం పెరిగినప్పుడు ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. అయినప్పటికీ రైతులకు రూ. 300కు యూరియా బ్యాగ్‌ను అందించాం. ఇది అంతర్జాతీయ మార్కెట్లో రూ. 3,000 ఖర్చవుతుంది.’’ అని మోడీ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు