శ్రీ సత్యసాయి జిల్లా లోని మడకశిర ఆర్టీసీ బస్టాండ్ వై సీపీ.కార్యకర్తల మధ్య ఘర్షణ
అమరావతి, 14 మార్చి (హి.స.) శ్రీ సత్య సాయి జిల్లాశ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర ఆర్టీసీ బస్స్టాండ్లో వైసీపీ(YCP) కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పార్టీ నాయకులు బహిరంగంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా
శ్రీ సత్యసాయి జిల్లా లోని మడకశిర ఆర్టీసీ బస్టాండ్ వై సీపీ.కార్యకర్తల మధ్య ఘర్షణ


అమరావతి, 14 మార్చి (హి.స.)

శ్రీ సత్య సాయి జిల్లాశ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర ఆర్టీసీ బస్స్టాండ్లో వైసీపీ(YCP) కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పార్టీ నాయకులు బహిరంగంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. మడకశిర వైసీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలే ఈ ఘర్షణకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మేళవాయి ఎంపీటీసీ నాగరత్నమ్మ భర్త రామచంద్రప్ప, హరేసముద్రానికి చెందిన లక్ష్మీనారాయణ మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.

ఇటీవల వైసీపీ ఇన్ఛార్జ్ ఈరలక్కప్పపై అధిష్టానానికి రామచంద్రప్ప ఫిర్యాదు చేశారు. ఈరలక్కప్పపై ఫిర్యాదు చేస్తారా అంటూ రామచంద్రప్పపై దాడికి పాల్పడి పిడిగుద్దులు గుద్దారు లక్ష్మీనారాయణ. బహిరంగంగా వైసీపీ నేతలు కొట్టుకోవడంపై పార్టీలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంతర్గత విభేదాలు, పార్టీ నేతలు బహిరంగంగా కొట్టుకోవడంపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande