ఉద్దానంలో కిడ్నీ మార్పిడి శాస్త్ర చికిత్స విజయవంతం
శ్రీకాకుళం14 మార్చి (హి.స.)- పలాస: మూత్రపిండాల వ్యాధితో దినదినగండంగా బతుకుతున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రజలకు ఊరటనిచ్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా పలాస కిడ్నీ పరిశోధన కేంద్రం ఆసుపత్రిలో శుక్రవారం తొలి కిడ్నీ మార్పిడి శస్త్ర
ఉద్దానంలో కిడ్నీ మార్పిడి శాస్త్ర చికిత్స విజయవంతం


శ్రీకాకుళం14 మార్చి (హి.స.)- పలాస: మూత్రపిండాల వ్యాధితో దినదినగండంగా బతుకుతున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రజలకు ఊరటనిచ్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా పలాస కిడ్నీ పరిశోధన కేంద్రం ఆసుపత్రిలో శుక్రవారం తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. సోంపేటకు చెందిన హేమశ్రీ రెండు మూత్రపిండాలు పాడవటంతో తండ్రి మోహనరావు కిడ్నీ దానం చేశారు. ఉద్దానం పరిశోధన కేంద్రంలో శ్రీకాకుళం కిమ్స్ ఆసుపత్రి సీనియర్ వైద్యుడు ఉమామహేశ్వరరావు నేతృత్వంలో నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజులతో కూడిన వైద్య బృందం 5 గంటల పాటు ఆపరేషన్ చేశారు.

బాధిత మహిళ కిడ్నీ బాగానే పని చేస్తోందని, మరో 15 రోజులు పోస్టు ఆపరేషన్ వైద్యసేవలు చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. దేశంలోనే తొలిసారి గ్రామీణ ప్రాంతమైన ఉద్దానం కిడ్నీ పరిశోధన కేంద్రం ఆసుపత్రిలో మూత్రపిండం మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతం చేసిన వైద్యుల బృందానికి వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande