
తిరుమల, 14 మార్చి (హి.స.), :తిరుమల శ్రీవారి దర్శన క్యూలైన్లో టీటీడీకి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఓ భక్తుడు చివరికి తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పాడు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన అనుపోజు వీర నవీన్ నారాయణగిరి షెడ్లలో తాను నినాదాలు చేయడంతో పాటు తోటి భక్తులను ప్రేరేపించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై టీటీడీ అతడిని పిలిపించి మాట్లాడగా క్యూలైన్లో నినాదాలు చేయడం తప్పేనని ఒప్పుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను టీటీడీ విడుదల చేసింది. కాగా, భక్తులందరూ శ్రీవారి దర్శన విషయంలో తమ వంతు వచ్చేవరకూ సంయమనంతో వేచి ఉండి సిబ్బందికి సహకరించాలని టీటీడీ ఓ ప్రకటన ద్వారా కోరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ