
అమరావతి, 14 మార్చి (హి.స.)అమరావతిలోనిఆయా గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఏపీ మంత్రి నారాయణ(వ్యాఖ్యానించారు. ఈ పనులు ప్రారంభించిన ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో అండర్ గ్రౌండ్ వాటర్, స్టామ్ వాటర్, వీధి దీపాలు, సిమెంట్ రోడ్లు వేస్తామని తెలిపారు. ఈరోజు(శనివారం) అమరావతిలోని అనంతవరం, నెక్కలు గ్రామసభల్లో మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో కల్పిస్తున్న మౌలిక సదుపాయాల గురించి గ్రామ ప్రజలకు వివరించారు. గ్రామస్తుల నుంచి వినతులు స్వీకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ