
అమరావతి, 14 మార్చి (హి.స.), అమరావతిలో ప్రపంచ స్థాయి మేనేజ్మెంట్ విద్యా సంస్థను ఏర్పాటు చేసే దిశగా ఎక్స్ఎల్ఆర్ఐ (జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్), ఏపీ సీఆర్డీఏ మధ్య శుక్రవారం కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఏపీ సీఆర్డీఏ తరఫున జాయింట్ డైరెక్టర్ (ఎస్టేట్స్) జుబిన్ చిరాన్ రాయ్, ఎక్స్ఎల్ఆర్ఐ తరఫున డైరెక్టర్, అధీకృత ప్రతినిధి ఫాదర్ పాల్ ఫెర్నాండేజ్ సంతకాలు చేశారు.
61.7 ఎకరాల్లో క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది. రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రతినిధులు వెల్లడించారు. మొదటి దశలో 1000మంది విద్యార్ధులకు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలు, 200 మంది ప్రొఫెషనల్స్కు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు అందించనున్నారు. 1949లో స్థాపితమైన ఈ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూళ్లలో ఒకటి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ