మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం.. మొత్తం మూడు పార్టీల నేతల హస్తం?
అమరావతి, 15 మార్చి (హి.స.) రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. వ్యాపారవేత్తలు, రియల్టర్లు, రాజకీయనేతలు ఇన్వాల్వ్ అయిన ఈ కేసులో తాజాగా సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. బీఆర్ఎస్ మాజీ ఎ
/key-issues-in-the-moinabad-drug-case-532254


అమరావతి, 15 మార్చి (హి.స.)

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. వ్యాపారవేత్తలు, రియల్టర్లు, రాజకీయనేతలు ఇన్వాల్వ్ అయిన ఈ కేసులో తాజాగా సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ (టీడీపీ) పుట్టా మహేశ్ కుమార్ తో పాటు మొత్తం 11 మంది ఈ పార్టీలో పాల్గొనగా వారిలో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఆరుగురికి డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ ఎస్పీ గిరిధర్ ఆదివారం వెల్లడించారు. ఏలూరి ఎంపీకి తొలుత నిర్వహించిన ర్యాపిడ్ టెస్ట్లో నెగిటివ్ వచ్చిందని ఆ తర్వాత నిర్వహించిన బ్లడ్ టెస్టులో పాటిజివ్ వచ్చిందని తెలిపారు. సిమ్లా నుంచి కొకైన్ తీసుకువచ్చినట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు. డ్రగ్స్ వాడకంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా డ్రగ్స్ తీసుకుంటే చర్యలు తప్పవన్నారు.

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే:

అయితే ఈ పార్టీలో రాజస్థాన్కు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సైతం ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో బీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ మూడు పార్టీల నేతలు ఈ పార్టీలో ఇన్వాల్వ్ మెంట్ ఉందనే చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలు ఉండటంతో ఈకేసు నుంచి తమ వారిని తప్పించేందుకు ఆయా పార్టీల పెద్దలు అధికారులపై పొలిటికల్ ప్రెజర్ చేస్తున్నారని ఇందుకోసం ఏకంగా ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు చేయిస్తున్నట్లు ప్రత్యర్థులు ఆరోపించడంతో ఈ కేసు ఇప్పుడు క్షణ క్షణం ఉత్కంఠ రేపుతోంది.

రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సీజ్!

తాజా పరిణామం నేపథ్యలో మొయినాబాద్లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిత్యం పెద్ద ఎత్తున పార్టీలతో పాటు ఈ ఫామ్ హౌస్ అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు డీల్స్ కూడా ఇదే ఫామ్ హౌస్లోనే జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ ఫామ్ హౌస్ను సీజ్ చేయాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫామ్ హౌస్ పై సీపీ యాక్ట్ నమోదు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో ఆర్డీవో సమక్షంలో ఈ ఫామ్ హౌస్ ను పోలీసులు సీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande