
తిరుమల, 15 మార్చి (హి.స.)
స్వామివారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం (ఉచిత దర్శనం) లభించడానికి ప్రస్తుతం 18 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోవడంతో, క్యూలైన్లు కృష్ణతేజ సర్కిల్ వరకు విస్తరించాయి. భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో టీటీడీ అధికారులు వారికి అవసరమైన తాగునీరు, ఆహార సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు.
కాగా, నిన్న ఒక్కరోజే మొత్తం 85,132 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.62 కోట్లుగా నమోదైంది. 38,855 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు ఆదివారం టీటీడీ వివరాలు తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV