
న్యూఢిల్లీ, 16 మార్చి (హి.స.)
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ
సీఎం అరవింద్ కేజ్రివాల్, మనీష్ సిసోడియా, ఇతరులకు ఢిల్లీ హైకోర్టు సోమవారం కొంత సమయం ఇచ్చింది. ఈ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేస్తూ (Discharge) ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై సమాధానం ఇచ్చేందుకు ఇవాళ కోర్టు గడువు పొడిగించింది. అయితే, సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై తమ వాదనలు వినిపించడానికి సమయం కావాలని కేజీవాల్ తరపు న్యాయవాదులు కోరారు. దీనిని సీబీఐ వ్యతిరేకించినప్పటికీ, కోర్టు ప్రతివాదులకు తమ వివరణ ఇచ్చుకోవడానికి అనుమతించింది.
అయితే, ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ను మార్చాలని కేజీవాల్ గతంలో కోరారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆ అభ్యర్థనను తిరస్కరించడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ శర్మ గతంలో తమ బెయిల్ పిటిషన్లను తిరస్కరించినందున, ఆమె బెంగ్పై తమకు నమ్మకం లేదని కేజీవాల్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉంది. కాగా, ఫిబ్రవరి 2026లో రౌస్ అవెన్యూ కోర్టు కేజీవాల్, సిసోడియా, కల్వకుంట్ల కవితతో సహా 23 మందిని మద్యం కేసు నుంచి విముక్తి కల్పిస్తూ తీర్పును వెలువరించింది. ఆ తీర్పు చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఇటీవలే సీబీఐ హైకోర్టులో అప్పీల్ చేసింది. ప్రస్తుతానికి హైకోర్టు విచారణను వాయిదా వేస్తూ.. నిందితులకు తమ కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేయాలని సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు