యుద్ధంలో పాల్గొనని దేశాలకు ఇరాన్ అనుమతి
టెహ్రాన్/డిల్లీ, 16 మార్చి (హి.స.): పశ్చిమాసియా యుద్ధంలో పాల్గొనని దేశాలకు ఇరాన్ గుడ్న్యూస్ చెప్పింది. ఆయా దేశాలు హర్ముజ్ జలసంధిని వాడుకోవచ్చని మరోసారి స్పష్టం చేసింది. హర్మూజ్ మీదుగా నౌకల ప్రయాణానికి ఇరాన్ సైన్యం అనుమతి తీసుకోవాలని, సమన్వయం చేసుకో
War


టెహ్రాన్/డిల్లీ, 16 మార్చి (హి.స.): పశ్చిమాసియా యుద్ధంలో పాల్గొనని దేశాలకు ఇరాన్ గుడ్న్యూస్ చెప్పింది. ఆయా దేశాలు హర్ముజ్ జలసంధిని వాడుకోవచ్చని మరోసారి స్పష్టం చేసింది. హర్మూజ్ మీదుగా నౌకల ప్రయాణానికి ఇరాన్ సైన్యం అనుమతి తీసుకోవాలని, సమన్వయం చేసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘై ప్రకటన చేశారు.

‘ఇరాన్ సాయుధ దళాలు ఆ జలసంధిని నియంత్రిస్తున్నాయి. మాపై దాడి చేస్తున్న ఏ దేశ నౌకను అయినా హర్ముజ్ జలసంధి వినియోగించడానికి అనుమతించం. జాతీయ భద్రత రక్షణ కోసం హర్ముజ్ జలసంధిలో అవసరమైన చర్యలు తీసుకునే హక్కు ఇరాన్కు ఉంది. ఆ జలమార్గాన్ని దుర్వినియోగం చేస్తూ దాడి చేసేవారిని అడ్డుకోవడమే మా లక్ష్యం. జలసంధి ద్వారా సురక్షితంగా నౌకలు ప్రయాణించేందుకు ఎన్నో ఏళ్లుగా ఇరాన్ కృషి చేసింది‘ అని అన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande