
ముంబై, 16 మార్చి (హి.స.)పశ్చిమాసియా యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారత ‘శివాలిక్’ గ్యాస్ ట్యాంకర్ ఎట్టకేలకు అడ్డంకులు దాటుకుని గుజరాత్ ఓడరేవుకు చేరుకుంది. గుజరాత్‌లోని ముంద్రా ఓడరేవుకు చేరుకున్నట్లుగా అధికారులు తెలిపారు.
షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా శనివారం మీడియాతో మాట్లాడుతూ.. శివాలిక్, నందా దేవి నౌకలు వరుసగా మార్చి 16, మార్చి 17 తేదీల్లో భారత్‌కు చేరుకుంటాయని తెలిపారు. అన్నట్లుగానే సోమవారం సాయంత్రం గుజరాత్ ఓడ రేవుకు శివాలిక్ చేరుకుంది. దీంతో భారత్‌లో గ్యాస్‌కు ఎలాంటి కొరత ఉండదు. ఈ నౌకలు దాదాపు 92,700 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీని తీసుకొస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు