
ఢిల్లీ,, 02 మార్చి (హి.స.)అమెరికా - ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌తో యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. యుద్ధం కారణంగా భారత విమానయాన రంగం ఇబ్బందుల్లో పడిపోయింది. భారీ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి. విమాన సర్వీసుల రద్దు కారణంగా వివిధ దేశాల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు చిక్కుకుపోయారు. యుద్ధం నేపథ్యంలో ఢిల్లీ ఐజీఐ 100 సర్వీసులను రద్దు చేసింది. చెన్నై ఎయిర్‌పోర్టు 30 సర్వీసులను, బెంగళూరు ఎయిర్‌పోర్టు 50 విమాన సర్వీసులను రద్దు చేసింది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు కూడా..
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి దోహా, అబుదాబి, జెడ్డా, సౌదీ అరేబియా వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. అలాగే కువైట్, దుబాయ్, మస్కట్, మదీనా వెళ్లే సర్వీసులు కూడా తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. సుమారు 22 విమానాలు రద్దు కాగా, వివిధ దేశాల నుంచి రావాల్సిన మరో 22 విమానాలు కూడా రద్దయ్యాయి. ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో, ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్‌వేస్ వంటి విమానయాన సంస్థలు విమానాలను రద్దు చేశాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు