కార్నీ పర్యటన వేళ.. భారత్-కెనడా మధ్య యురేనియం డీల్
ఢిల్లీ, , 02 మార్చి (హి.స.) భారత్‌-కెనడా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. సోమవారం 2.6 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం సరఫరా ఒప్పందం మీద రెండుదేశాలు సంతకాలు చేశాయి (India-Canada Uranium deal). అలాగే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై చర్చలు జరిపే
కార్నీ పర్యటన వేళ.. భారత్-కెనడా మధ్య యురేనియం డీల్


ఢిల్లీ, , 02 మార్చి (హి.స.) భారత్‌-కెనడా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. సోమవారం 2.6 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం సరఫరా ఒప్పందం మీద రెండుదేశాలు సంతకాలు చేశాయి (India-Canada Uranium deal). అలాగే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై చర్చలు జరిపేందుకు అంగీకారం కుదిరింది. హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్రమోదీ, కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

దేశంలో పౌర అణుఇంధన కార్యక్రమానికి నిరంతరాయ సరఫరాను కొనసాగించడమే ఈ డీల్ ఉద్దేశం. చిన్న రియాక్టర్లు, అధునాతన రియాక్టర్లపై కలిసి పనిచేయనున్నామని మోదీ (PM Modi) తెలిపారు అలాగే 2026 చివరినాటికి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై కొలిక్కి రావాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నట్లు కార్నీ వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande