హోలీ తర్వాత ఉంటదీ.. బయటకొస్తే చుక్కలే!
న్యూఢిల్లీ: , 02 మార్చి (హి.స.)మార్చి నెల ప్రారంభం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గడిచిన మూడేళ్ల కాలంలో 2026 ఫిబ్రవరి నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు న
హోలీ తర్వాత ఉంటదీ.. బయటకొస్తే చుక్కలే!


న్యూఢిల్లీ: , 02 మార్చి (హి.స.)మార్చి నెల ప్రారంభం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గడిచిన మూడేళ్ల కాలంలో 2026 ఫిబ్రవరి నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన వివరాల ప్రకారం, మార్చి 1వ తేదీన ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 31 నుంచి 32 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా ఉంది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా హోలీ పండగ తరువాత అంటే మార్చి 7 నాటికి గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల మార్కును తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande