రాజ్యసభ సభ్యుల్లో 32 శాతం మందిపై క్రిమినల్ కేసులు
దిల్లీ: 20 మార్చి (హి.స.)రాజ్యసభ సిట్టింగ్ ఎంపీలలో 32 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, 14 శాతం మంది రూ 100 కోట్లకు మించిన ఆస్తులు కలిగివున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫాంస్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. ఎన్నిక సమయంలో 229 మంది ఎంపీలు స
Parliament


దిల్లీ: 20 మార్చి (హి.స.)రాజ్యసభ సిట్టింగ్ ఎంపీలలో 32 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, 14 శాతం మంది రూ 100 కోట్లకు మించిన ఆస్తులు కలిగివున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫాంస్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. ఎన్నిక సమయంలో 229 మంది ఎంపీలు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఏడీఆర్ ఈ వివరాలు వెల్లడించింది. మొత్తం 73 మందిపై క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్నాయని, అందులో 36 మంది తీవ్ర నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని సంస్థ తెలిపింది. 99 మంది భాజపా ఎంపీలలో 27 మంది, 28 మంది కాంగ్రెస్ సభ్యుల్లో 12 మంది, 13 మంది టీఎంసీ సభ్యుల్లో నలుగురు, 10 మంది ఆప్ సభ్యుల్లో నలుగురు నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారని వివరించింది. 31మంది ఎంపీలు (14 శాతం) రూ 100 కోట్ల కన్నా ఎక్కువ ఆస్తులు కలిగివున్నారని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.వీరిలో ఆరుగురు భాజపాకు, ఐదుగురు కాంగ్రెస్కు, నలుగురు వైఎస్ఆర్సీపీకి, ఇద్దరు బీఆర్ఎస్కు, ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీకి, ముగ్గురు ఎన్సీపీకి చెందినవారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande