9 దేశాల గగనతలాలను వాడుకోవద్దుడీజీసీఏ సూచన
దిల్లీ: , 20 మార్చి (హి.స.)పశ్చిమాసియాలోని 9 దేశాల గగనతలాలను వాడుకోవద్దని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సూచించింది. బహ్రెయిన్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (య
9 దేశాల గగనతలాలను వాడుకోవద్దుడీజీసీఏ సూచన


దిల్లీ: , 20 మార్చి (హి.స.)పశ్చిమాసియాలోని 9 దేశాల గగనతలాలను వాడుకోవద్దని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సూచించింది. బహ్రెయిన్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లపై వెళ్లొద్దని పేర్కొంది. కొన్ని షరతులతో ఒమన్, సౌదీ అరేబియాలకు వెళ్లొచ్చని సూచించింది. అయితే ఈ గగనతలాల్లోనూ ఎఫ్ఎల్ 320, 32,000 అడుగుల కంటే దిగువన వెళ్లకూడదని స్పష్టం చేసింది.

న్యూయార్క్ నుంచి ముంబయికి వస్తున్న ఎయిరిండియా విమానం అగ్ని ప్రమాద హెచ్చరికతో గురువారం మధ్యాహ్నం అత్యవసరంగా సౌదీ అరేబియాలోని మదీనాలో దిగింది. విమానం వెనుకభాగంలోని కార్గోలో మంటలు వస్తున్నాయని కాక్పిట్లో హెచ్చరిక రావడంతో దానిని మళ్లించాల్సి వచ్చింది. తనిఖీల అనంతరం అది తప్పుగా వచ్చిన హెచ్చరికగా నిర్దారణ అయింది. ఆ తర్వాత అది ముంబయికి చేరుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande