ఆధునిక యుద్ధం..సరిహద్దులు దాటింది: రాజ్నాథ్ సింగ్
హైదరాబాద్, 21 మార్చి (హి.స.)యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో జరిగే ఘర్షణ మాత్రమే కాదని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) పేర్కొన్నారు. ప్రస్తుతం యుద్ధం సరిహద్దులను దాటిందని.. ఆర్థిక, డిజిటల్, ఇంధన, ఆహార భద్రతలు కూడా జాతీయ భద్రతలో భాగ
ఆధునిక యుద్ధం..సరిహద్దులు దాటింది: రాజ్నాథ్ సింగ్


హైదరాబాద్, 21 మార్చి (హి.స.)యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో జరిగే ఘర్షణ మాత్రమే కాదని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) పేర్కొన్నారు. ప్రస్తుతం యుద్ధం సరిహద్దులను దాటిందని.. ఆర్థిక, డిజిటల్, ఇంధన, ఆహార భద్రతలు కూడా జాతీయ భద్రతలో భాగమయ్యాయని అన్నారు. వాటి ద్వారా ఒక దేశం మరో దేశాన్ని బలహీనపరిచే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి ప్రతి పౌరుడు అన్ని వేళలా దేశ రక్షణ కోసం సన్నద్ధమై ఉండాలని పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్‌లోని సైనిక పాఠశాల ఆవిర్భావ దినోత్సవంలో వర్చువల్‌గా పాల్గొన్న రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ..ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆధునిక యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా దేశంలో ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అందులో భాగంగానే సాయుధ దళాలకు అధునాతన, స్వదేశీ ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశ రక్షణలో యువత కూడా తమ వంతు పాత్ర పోషించాలని రాజ్‌నాథ్‌ సింగ్ పిలుపునిచ్చారు. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలిగేలా క్రమశిక్షణ, మానసిక దృఢత్వం పెంపొందించుకోవాలన్నారు. సైన్యం, పౌరులు బలంగా ఉన్నప్పుడే దేశం ముందడుగు వేస్తుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande