ఎస్బీఐకి ఐటీ శాఖ భారీ ట్యాక్స్ నోటీసు..
ముంబై, 21 మార్చి (హి.స.)దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు ఆదాయపు పన్ను శాఖ నుండి భారీ నోటీసు అందింది. వడ్డీతో కలిపి మొత్తం రూ. 6,337.5 కోట్ల మేర పన్ను చెల్లించాలని ఐటీ శాఖ డిమాండ్ నోటీసు జారీ చేసింది. శుక్రవారం
ఎస్బీఐకి ఐటీ శాఖ భారీ ట్యాక్స్ నోటీసు..


ముంబై, 21 మార్చి (హి.స.)దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు ఆదాయపు పన్ను శాఖ నుండి భారీ నోటీసు అందింది. వడ్డీతో కలిపి మొత్తం రూ. 6,337.5 కోట్ల మేర పన్ను చెల్లించాలని ఐటీ శాఖ డిమాండ్ నోటీసు జారీ చేసింది. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఎస్‌బీఐ ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

అసలు ఏం జరిగింది?

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 143(3), 144సి(3), 144బి కింద ఐటీ శాఖ మార్చి 19న ఈ ఉత్తర్వులను జారీ చేసింది. 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి (AY24) సంబంధించి నిర్వహించిన స్క్రూటినీ అసెస్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ఈ పన్ను డిమాండ్ ఉత్పన్నమైందని బ్యాంక్ తెలిపింది. వివిధ అంశాల్లో ఆదాయపు పన్ను శాఖ చేసిన కోతలే (Disallowances) ఈ భారీ మొత్తానికి కారణమని తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande