విద్యకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత. డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మం, 22 మార్చి (హి.స.) విద్యకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు. విద్య కోసం పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్ తరాలను నిర్మించడం కోసం పెట్టే పెట్టుబడిగా ఆయన అభివర్ణించారు. ఆద
భట్టి


ఖమ్మం, 22 మార్చి (హి.స.)

విద్యకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం

అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు. విద్య కోసం పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్ తరాలను నిర్మించడం కోసం పెట్టే పెట్టుబడిగా ఆయన అభివర్ణించారు. ఆదివారం మధిర నియోజకవర్గంలో పర్యటించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామంలో నిర్మాణం అవుతున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న భవన సముదాయాలను కలియతిరుగుతూ ఆయన పరిశీలన చేశారు. నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను, గుత్తేదారులను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ సందర్భంగా జూనియర్ హాస్టల్, జూనియర్, సీనియర్, అడ్మినిస్ట్రేటివ్ భవనాల నిర్మాణాన్ని పరిశీలించారు. అంతేకాకుండా మెకానికల్, సైన్స్, మ్యాథమెటిక్స్ కంప్యూటర్ ల్యాబ్ భవనాల నిర్మాణాలను పరిశీలన చేశారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడవద్దు అని ఆయన చెప్పారు. ఇవి కేవలం భవనాలు కాదు రేపటి తరాలను ఉజ్వలంగా నిర్మించే దేవాలయాలుగా అభివర్ణించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande