
ఢిల్లీ, 22మార్చి (హి.స.) భారత రాజకీయ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ మరో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. దేశంలో అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా (Head of Government) పనిచేసిన నాయకునిగా అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నారు. ఆదివారం (మార్చి 22, 2026) నాటికి ప్రధాని పదవిలో 8,931 రోజులు పూర్తి చేసుకున్న మోదీ.. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న సుదీర్ఘకాల పదవీకాల రికార్డును అధిగమించారు. గతంలో సిక్కిం మాజీ ముఖ్యమంత్రి చామ్లింగ్ 8,930 రోజుల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి రికార్డు నెలకొల్పగా, ఇప్పుడు మోదీ ఆ మైలురాయిని అధిగమించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం సేవలు అందించడంతో పాటు, భారత ప్రధానిగా మోదీ కొనసాగిస్తున్న పయనం ఈ అరుదైన ఘనతను సాధ్యం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ