అంబేద్కర్ కోనసీమ జిల్లా పై గన్నవరం తృటిలో ప్రమాదం తప్పింది
అమరావతి, 23 మార్చి (హి.స.) గన్నవరం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో తృటిలో ప్రమాదం తప్పింది. మండలంలోని పోతవరం వద్ద పెట్రోల్ బంక్లో ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనంలో పెట్రోల్ పోయించుకున్నారు. అనంతరం బైక్ స్టార్ట్ చేయగానే ఒక్కసారిగా మంటలు చెలర
అంబేద్కర్ కోనసీమ జిల్లా పై గన్నవరం తృటిలో ప్రమాదం తప్పింది


అమరావతి, 23 మార్చి (హి.స.)

గన్నవరం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో తృటిలో ప్రమాదం తప్పింది. మండలంలోని పోతవరం వద్ద పెట్రోల్ బంక్లో ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనంలో పెట్రోల్ పోయించుకున్నారు. అనంతరం బైక్ స్టార్ట్ చేయగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన బైక్ యజమాని, బంక్ సిబ్బంది వెంటనే ద్విచక్రవాహనాన్ని దూరంగా నెట్టేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అప్పటికే బైక్ పూర్తిగా కాలిపోయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande