ప్రపంచానికి ఏపీ సత్తా చాటిచెప్పే ప్రాజెక్ట్ ఈ స్టీల్ప్లాంట్: చంద్రబాబు
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో విశాఖ ఉక్కు కంటే అతిపెద్ద ప్లాంట్ రాబోతోందని, ఉత్తరాంధ్రలోని నక్కపల్లిలో సరికొత్త చరిత్ర రాయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.
ప్రపంచానికి ఏపీ సత్తా చాటిచెప్పే ప్రాజెక్ట్ ఈ స్టీల్ప్లాంట్: చంద్రబాబు


అమరావతి, 23 మార్చి (హి.స.)అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో విశాఖ ఉక్కు కంటే అతిపెద్ద ప్లాంట్ రాబోతోందని, ఉత్తరాంధ్రలోని నక్కపల్లిలో సరికొత్త చరిత్ర రాయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆర్సెలార్ స్టీల్ప్లాంట్ పెట్టుబడి ఓ గొప్ప మలుపు కాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్కు భూమి పూజ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ..

ప్రపంచానికి ఏపీ సత్తా చాటిచెప్పే ప్రాజెక్ట్ ఈ స్టీల్ప్లాంట్. ప్రధాని మోదీ సహకారంతోనే ప్లాంట్ ఏర్పాటు సాధ్యమైంది. స్టీల్ప్లాంట్ ఏర్పాటులో మంత్రి లోకేశ్ కృషి ఎంతో ఉంది. అన్నివిధాలా సహకరిస్తున్న పవన్ కల్యాణ్కు ధన్యవాదాలు. ప్లాంట్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి. ఇది స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన కాదు.. స్టీల్ సిటీకి ఫౌండేషన్. ఏపీలో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందిస్తున్నాం. కేంద్రం సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతోంది. ప్లాంట్ ఏర్పాటుతో లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులకు రుణపడి ఉంటాం. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతాం. క్వాంటమ్ వ్యాలీకి కేరాఫ్గా అమరావతి మారబోతోంది. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాబోతోంది’ అని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande