అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం
Kishan Reddy


హైదరాబాద్, 23 మార్చి (హి.స.):

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజాగ్రహాన్ని అణిచివేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. బీజేపీ చేపట్టిన 'చలో అసెంబ్లీ' కార్యక్రమాన్ని అడ్డుకోవడం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుతో పాటు సీనియర్ నేతలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆయన ఖండించారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం ప్రభుత్వ అభద్రతాభావానికి నిదర్శనమని, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కాకుండా పోలీస్ రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని,

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande