గవర్నర్ను కలిసిన బీఆర్ఎస్ బృందం.. మంత్రి పొంగులేటిపై ఫిర్యాదు
హైదరాబాద్, 30 మార్చి (హి.స.) హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్తో బీఆర్ఎస్ శాసనసభ పక్షం సోమవారం మధ్యాహ్నం భేటీ అయింది. ఈ సందర్భంగా రాఘవ కన్స్ట్రక్షన్పై ఫిర్యాదు చేసింది. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జ
Brs


హైదరాబాద్, 30 మార్చి (హి.స.)

హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్తో బీఆర్ఎస్ శాసనసభ పక్షం సోమవారం మధ్యాహ్నం భేటీ అయింది. ఈ సందర్భంగా రాఘవ కన్స్ట్రక్షన్పై ఫిర్యాదు చేసింది. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలనపై గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజా సంపదను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ మైనింగ్ చేస్తున్నారని అన్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా వందల కోట్ల ప్రజా సంపద కొల్లగొడుతున్నారని.. వివరాలతో గవర్నర్కు ఫిర్యాదు. చేసినట్లు పేర్కొన్నారు. ఇదే విషయమై మా నాయకుడు హరీష్ రావు అసెంబ్లీలో లేవనెత్తితై ఎదురుదాడి చేశారు. అక్రమ మైనింగ్పై CB CID విచారణ చేయిస్తాం అని సీఎం అంటున్నారు మేము హౌస్ కమిటీ వెయ్యాలని డిమాండ్ చేశాము. హౌస్ కమిటీలకు విలువ లేదని మంత్రి శ్రీధర్ బాబు అనడం విడ్డూరం. పార్లమెంట్లో రాహుల్ గాంధీ హౌస్ కమిటీకి అనేక సార్లు డిమాండ్ చేశారు. ఇక్కడేమో హౌస్ కమిటీలకు విలువ లేదని ప్రభుత్వం అనడం ఎంత వరకు సబబుని కేటీఆర్

ప్రశ్నించారు.

CB CID రాష్ట్ర ప్రభుత్వంలో ఒక విభాగం, మంత్రిపై విచారణ నిష్పక్షపాతంగా జరగదు. మంత్రివర్గం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాము. ఇదే విషయమై ఈరోజు మండలిలో మా ఎమ్మెల్సీలు నిలదీస్తే వారిని సస్పెండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారితే, రక్షకులే భక్షకులు అయితే ఎలా ప్రజలకు ఎవరు దిక్కు. హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలని గవర్నర్కు చెప్పాం.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande