
హైదరాబాద్, 30 మార్చి (హి.స.)బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని పార్క్ హయత్ హోటల్ వద్ద జరుగుతున్న కేబీఆర్ పార్క్ ప్యాకేజ్ ఫ్లైఓవర్ పనులను జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్, చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్తో కలిసి సోమవారం పరిశీలించారు. మొత్తం 6 పియర్ ఫౌండేషన్ల తవ్వకాలు పూర్తయ్యాయని, అందులో 3 పియర్లకు పీసీసీ బెడ్ పనులు పూర్తయ్యాయని అధికారులు కమిషనర్కు తెలిపారు. రాఫ్ట్ ఫౌండేషన్ల కోసం స్టీల్ ఫ్యాబ్రికేషన్ పనులు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా పనులు సాగుతున్న తీరుపట్ల కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో మరింత వేగం పెంచేందుకు ఎంఈఐఎల్(మెగా) సంస్థ అదనంగా మెషిన్, మ్యాన్ పవర్ ను సమకూర్చుకోవాలని కమిషనర్ ఆదేశించారు. క్షేత్ర తనిఖీలో కమిషనర్ వెంట ఈఈ (ప్రాజెక్ట్స్), డీఈఈ, ఏఈఈ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు