ఉద్యోగుల స్థానికత నిబంధనలలో మార్పులు చేయాలంటూ సీఎంకు కవిత లేఖ
హైదరాబాద్, 30 మార్చి (హి.స.) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. ''2021 డిసెంబర్ 6న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.317 ద్వారా వేలాది మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని,
Kavita letter


హైదరాబాద్, 30 మార్చి (హి.స.)

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. '2021 డిసెంబర్ 6న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.317 ద్వారా వేలాది మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ఆ జీవోను రద్దు చేసి ఉద్యోగులకు వారి సొంత జిల్లాల్లో పోస్టింగ్స్ ఇవ్వాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడి హోదాలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మీరు లేఖ రాసిన విషయం గుర్తు ఉండి ఉంటుందని భావిస్తున్నాం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే జీవో నం.317ను సమీక్షించి బాధిత ఉద్యోగులకు న్యాయం చేస్తామని మీరు హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ హామీని నొక్కి చెప్పారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో మీరు, ప్రస్తుత మీ మంత్రివర్గంలో ఉన్న పలువురు నాయకులు ప్రభుత్వ ఉద్యోగులను మానసిక క్షోభకు గురి చేస్తున్న జీవో నం.317 బాధితులకు న్యాయం చేస్తామని పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు.

వెంటనే జీవో 2.317 బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులకు వన్ టైం రిలీఫ్ కింద వారి స్థానికత ఆధారంగా వారి స్వస్థలాలకు బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నాం. అలాగే స్థానికతను గుర్తించే నిబంధనల్లోనూ సమూల మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నాం' అని లేఖలో కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande