ఎమ్మెల్సీ పదవికి నితీష్ రాజీనామా
పట్నా/ఢిల్లీ.,30 జనవరి (హి.స.) : బిహార్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన శాసనమండలి సభ్యత్వానికి (ఎంఎల్సీ) సోమవారం రాజీనామా చేశారు. ఇటీవల ఆయన రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం
Voting is not just a right but a responsibility in a democracy: Nitish Kumar


పట్నా/ఢిల్లీ.,30 జనవరి (హి.స.) : బిహార్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన శాసనమండలి సభ్యత్వానికి (ఎంఎల్సీ) సోమవారం రాజీనామా చేశారు. ఇటీవల ఆయన రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జేడీయూ ఎమ్మెల్సీ సంజయ్ గాంధీ ఈ రాజీనామా లేఖను కౌన్సిల్ సెక్రటేరియట్కు సమర్పించారు.

గడువు ముగియడంతో నిర్ణయం

మార్చి 16న నితీష్ కుమార్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 101, 190 ప్రకారం.. ఒక వ్యక్తి ఏకకాలంలో అటు పార్లమెంటులోనూ, ఇటు రాష్ట్ర శాసనసభ లేదా మండలిలోనూ సభ్యునిగా కొనసాగకూడదు. 1950 నాటి ‘ప్రొహిబిషన్ ఆఫ్ సైమల్టేనియస్ మెంబర్షిప్’ నిబంధనల ప్రకారం, ఎన్నికైన 14 రోజుల లోపు ఏదో ఒక పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ గడువు మార్చి 30 (సోమవారం) నాటితో ముగియనుండటంతో, చివరి రోజున ఆయన తన ఎమ్మెల్సీ పదవికి నితీష్ రాజీనామా చేశారు. కేబినెట్ మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande